| |
|
1 |
మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. :- అమరానాథ్ అమర్ |
2 |
చావు పుట్టుకలు సహజం ఎవరూ తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురించి ఆలోచించారు. :- అమరానాథ్ అమర్ |
3 |
నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయు. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ ధరి చేరదు. :- అమరానాథ్ అమర్
|
4 |
కుండలు వేరైన మట్టి ఒక్కటే నగలు వేరైన బంగారం ఒక్కటే ఆవులు వేరైనా పాలు ఒక్కటే అల్లాగే దేహాలు వేరైన పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్న వాడే జ్ఞాని :- అమరానాథ్ అమర్
|
5 |
అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది. తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. :- అమరానాథ్ అమర్
|
6 |
మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. :- అమరానాథ్ అమర్
|
7 |
మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఎవరూ అమరులు కాదు. :- అమరానాథ్ అమర్
|
8 |
భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు. మనం శవంగా మారేలోపు జీవితపరమార్ధాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం. :- అమరానాథ్ అమర్
|
9 |
కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి..ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి. :- అమరానాథ్ అమర్
|
10 |
కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కాని. వాటి ఫలితాలయందు కాదు. :- అమరానాథ్ అమర్
|
11 |
అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది.:- అమరానాథ్ అమర్
|
12 |
కామం, కోపం మరియు దురాశ ఈ మూడు నరకానికి మూడు తలుపులు . :- అమరానాథ్ అమర్ |
13 |
ఈ సృష్టి ని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే , మరియు ముగించేది కూడా నేనే. :- అమరానాథ్ అమర్
|
14 |
జరిగినాదంత మన మంచి కోసమే జరిగింది. జరుగుతున్నదంతా మన మంచి కోసం జరుగుతోంది. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన మంచి కోసం జరుగుతుంది. :- అమరానాథ్ అమర్
|
15 |
మనిషి తన నమ్మకంతో తయారవుతాడు. అతను నమ్మిందే తాను. :- అమరానాథ్ అమర్
|
16 |
ఆశించడం మానేసినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. :- అమరానాథ్ అమర్
|
17 |
నువ్వు ఏం చేసినా ఆ చర్యలు శ్రీకృష్ణుడి ప్రకారమే. నేను నీలో ఎప్పుడూ ఉంటాను. :- అమరానాథ్ అమర్
|
18 |
నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. :- అమరానాథ్ అమర్
|
19 |
గుర్తుంచుకో...ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడ ఏ జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. :- అమరానాథ్ అమర్
|
20 |
మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు. :- అమరానాథ్ అమర్
|
21 |
మానసిక శాంతి చాలా ముఖ్యం. కోపం అనేది భ్రమలాంటిది. అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది. :- అమరానాథ్ అమర్
|
22 |
అతిగా స్పందించడం, అది కోపం, అతి ప్రేమ, అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు. :- అమరానాథ్ అమర్
|
23 |
స్వార్థం నీ వివేకాన్ని చంపేస్తుంది. స్వార్థపరుడు తన లాభాల కోసమే చూస్తాడు. ఇతరులే సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. :- అమరానాథ్ అమర్
|
24 |
అన్ని పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మంచి కర్మలు చేయాలి. :- అమరానాథ్ అమర్
|
25 |
కర్తవ్యం నిర్వర్తించడంలో సిగ్గుపడకూడదు. మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు. సరైన పనిచేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. నీ కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు . :- అమరానాథ్ అమర్
|
26 |
మీరు కేవలం కర్మకు మాత్రమే అర్హులు, దాని ఫలాలు ఎన్నటికీ పొందలేరు . :- అమరానాథ్ అమర్
|
27 |
కార్యక్రియలో, క్రియాసంరలలో, క్రియాసంతో, క్రియాసంరలలో, కార్యోన్మకక్రియలను చూసే వాడు, మనుష్యులలో తెలివైనవాడు. :- అమరానాథ్ అమర్
|
28 |
నిస్వార్థ సేవ ద్వారా మీరు ఎల్లప్పుడూ ఫలప్రదంగా ఉంటారు మరియు మీ కోరికలను నెరవేర్చగలుగుతారు. :- అమరానాథ్ అమర్
|
29 |
అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. :- అమరానాథ్ అమర్
|
30 |
ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. :- అమరానాథ్ అమర్
|
31 |
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది. :- అమరానాథ్ అమర్
|
32 |
ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను. :- అమరానాథ్ అమర్
|
33 |
అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. :- అమరానాథ్ అమర్
|
34 |
శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. :- అమరానాథ్ అమర్
|
35 |
ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. :- అమరానాథ్ అమర్
|
36 |
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. :- అమరానాథ్ అమర్
|
37 |
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. :- అమరానాథ్ అమర్
|
38 |
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. :- అమరానాథ్ అమర్
|
39 |
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. :- అమరానాథ్ అమర్
|
40 |
జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. :- అమరానాథ్ అమర్
|
| |
నీది అంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. |
| |
ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు… పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు. |
| |
|